World జిల్లాలు హెల్త్

నేటి రాశి ఫలితాలు (31-05-2021)

వారం: సోమవారంతిథి: పంచమి ఉ7:08నక్షత్రం: శ్రవణం రా.8:55శుభసమయం: మ.12:01దుర్ముహూర్తం: ప.12:22 నుండి ప.1:18 వరకుపునః ప.2:55 నుండి ప.2:55 వరకురాహుకాలం: ఉ.7:30 నుండి ఉ.9.00 వరకుయమగండం: ఉ.10.30 నుండి మ.12.00 వరకు మేషంసమాజంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభంముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ […]

నేటి పంచాంగం(31-05-2021)

వారం: సోమవారంతిథి: పంచమి ఉ7:08నక్షత్రం: శ్రవణం రా.8:55కరణం: తైతుల ఉ.7:08యోగం: బ్రహ్మం ప.11:00శుభసమయం: మ.12:01దుర్ముహూర్తం: ప.12:22 నుండి ప.1:18 వరకుపునః ప.2:55 నుండి ప.2:55 వరకురాహుకాలం: ఉ.7:30 నుండి ఉ.9.00 వరకుయమగండం: ఉ.10.30 నుండి మ.12.00 వరకువర్జము: రా.1:04 నుండి 2:40 వరకు

National జిల్లాలు వినోదం

కరోనాతో యువతి.. బెడ్ పై తాళి కట్టిన యువకుడు

కరోనా బారిన పడి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న యువతికి ధైర్యం చెప్పేందుకు ఆమె ప్రియుడు ఐసీయూ బెడ్ మీదనే తాళి కట్టాడు. ప్రియుడి ధైర్యం చెప్పినా.. ఆమె కరోనాకు బలైంది. ఆమె మృతిచెందడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అంతలోనే ఆమె కరోనా బారిన పడింది. దీంతో కుటుంబ […]

National క్రీడలు జిల్లాలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌ డౌన్ సడలింపు నిబంధనలు పొడిగించిన నేపథ్యంలో సడలింపు నిబంధనలకు అనుగుణంగా భూములు, ఆస్తులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ను పొడిగించిన విషయం తెలిసిందే. అయితే కర్ఫ్యూ సడలింపును ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకూ పెంచడంతో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల వరకే […]

Local National World జిల్లాలు వినోదం

కొత్తగా 1,801 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,801 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,75,827కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనాతో మరో 16 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,263కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 35,042 యాక్టీవ్ కేసులున్నట్లు […]

National విద్య హెల్త్

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

తెలంగాణలో లాక్‌ డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో సైతం సమయాల్లో మార్పు చేసింది. ఇక నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చివరి మెట్రో రైలు ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై చివరి స్టేషన్‌ కు 12.45కి చేరుకుంటుందని మెట్రో ఎండీ ఎండీ కేవీబీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని కోరారు. స్టేషన్ల వద్ద […]

National జిల్లాలు హెల్త్

24 గంటల్లో 402 మంది మృతి

మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 18,600 మందికి కరోనా పాజిటివ్‌ గా తేలింది. 2 నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో చివరిసారిగా మార్చి 16న సుమారు 18,000 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 402 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2,71,801 యాక్టివ్‌ కేసులున్నాయి.

National జిల్లాలు వినోదం

నేటి బంగారం ధరలు(31-05-2021)

బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.45,810 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.49,960 కి చేరింది. బంగారం ధరలు పెరిగిన వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.4600 తగ్గి రూ.71,600 కు చేరింది.

Local విద్య హెల్త్

తెరిచి ఉండేవి.. మూసి ఉండేవి ఇవే

తెలంగాణలో లాక్‌ డౌన్‌ ను మరో 10 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి లాక్‌ డౌన్‌ పొడిగింపు అమల్లోకి వచ్చింది. లాక్‌డౌన్‌ను పొడిగించిన ప్రభుత్వం.. సడలింపులు పెంచింది. నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌ డౌన్ సడలింపులు ఉంటాయి. ఆ తర్వాత మరో గంట పాటు […]

World జిల్లాలు వినోదం

ఆనందయ్య మందుపై నేడే ఫైనల్ రిపోర్ట్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై ఈరోజు తుది నివేదిక రానుంది. ఆయన పంపిణీ చేసిన మందు పనితీరుపై వైద్య బృందాలు ఇప్పటికే అధ్యయనం చేశాయి. ఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఆన్ లైన్ లో రిపోర్టులను పంపాయి. కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ పరిశోధకులు ఆ రిపోర్టులను పరిశీలించారు. ఈరోజు మందుపై క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై ఈరోజు హైకోర్టులో తుదివిచారణ జరగనుంది. అయితే ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు ఈరోజు […]

Local క్రీడలు వినోదం

నేటి రాశి ఫలితాలు (30-05-2021)

వారం: ఆదివారంతిథి: చవితి ఉ7:40నక్షత్రం: ఉత్తరాషాఢ రా.9:30శుభసమయం: మ.2:01దుర్ముహూర్తం:సా. 4:38 నుండి సా.5:26 వరకురాహుకాలం: సా.4:30 నుండి సా.6.00 వరకుయమగండం: మ.12.00 నుండి మ.1.30 వరకు మేషంచేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో చర్చలు పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృషభంపనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన […]

Local National World జిల్లాలు

రైతులకు శుభవార్త

తెలంగాణ రైతులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) శుభవార్త చెప్పారు. జూన్ 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులను జమచేస్తామని తెలిపారు. వానాకాలం ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను ఫెస్టిసైడ్స్‌ను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కల్తీవిత్తనాలు, ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద ఉక్కుపాదం మోపాలని వ్యవసాయ శాఖ , పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు సీఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Local ఉద్యోగాలు విద్య వినోదం

8వ తరగతి వారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు

ఇతర వివరాలు: పోస్టుల వివరాలు: సోల్జర్వయస్సు: పోస్టును బట్టి 171/2-23 సంవత్సరాలు మించి ఉండరాదుధరఖాస్తు విధానం: ఆన్ లైన్దరఖాస్తుకు చివరి తేదీ: 27/06/2021 వెబ్ సైట్: https://joinindianarmy.nic.in/పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/3oqv4d8ఉద్యోగ రకము: ఫుల్ టైంసంస్థ పేరు: ఇండియన్ ఆర్మీవేతనం: పోస్టును బట్టిషిఫ్ట్ టైమ్: జనరల్విద్య: 8వ తరగతి, టెన్త్, ఇంటర్, డి ఫార్మసీ

Local National క్రీడలు వినోదం

సీఎం జగన్ పై మరో కేసు!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో మరొకటి చేరింది. ఇప్పటికే జగన్ పై 11 సబీఐ, 6 ఈడీ కేసులు నమోదు కాగా, తాజాగా మరో కేసు నమోదు అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18 కి చేరింది. ఉమ్మడి రాష్ట్ర ఏపీ హౌసింగ్‌ బోర్డు, ఇందూ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టిన హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సీఎం […]

Local క్రీడలు జిల్లాలు

లాక్ డౌన్ పై మూడు ప్రతిపాదనలు?

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం కాబోతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ముందు మూడు ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించడం. రెండవది వీకెండ్ లాక్ డౌన్. శని ఆదివారాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ […]

Local National విద్య హెల్త్

జూన్ 8న చేప ప్రసాదం.. ఎక్కడంటే?

ఉబ్బసం బాధితులకు అందించే చేప ప్రసాదం జూన్ 8న ఉదయం 10 గంటల నుంచి పంపిణీ చేస్తామని బత్తిని గౌడ్ సోదరులు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ దూద్ బౌలిలోని మృగశిర ట్రస్టు భవనంలో చేప ప్రసాదం ఇస్తామని.. పంపిణీ 24 గంటల పాటు కొనసాగుతుందని వివరించారు. కాగా ఈ చేప ప్రసాదం తీసుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు.

National ఉద్యోగాలు వినోదం

డిప్యూటీ తహసీల్దార్ ఇంట్లో మారణాయుధాలు!

మారణాయుధాలతో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్ సృష్టించాడు. తుపాకీ చూపి బెదిరించడంతో బెంబెలెత్తిన యువకులు పోలీసులను సంప్రదించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కమలా నగర్ కు చెందిన ఎం. ప్రణీత్ కుమార్ అతని స్నేహితులు శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కాలనీ లో ఉన్న పార్కు వద్ద వాకింగ్ చేస్తూ గౌలీ కార్ ఫంక్షన్ హాల్ వైపు టాయిలెట్ కు వెళ్లాడు. సమీపంలో నివసిస్తున్న జిల్లా […]

National ఉద్యోగాలు జిల్లాలు విద్య

నేటి రాశి ఫలితాలు (29-05-2021)

వారం: శనివారంతిథి: తదియ ఉ10:33నక్షత్రం: పూర్వాషాఢ రా.10:23శుభసమయం: మ.1:00దుర్ముహూర్తం:సూర్యోదయం నుండి ఉ.7:25 వరకురాహుకాలం: ఉ.9:00 నుండి ఉ.10.30 వరకుయమగండం: మ.1.30 నుండి సా.3.00 వరకు మేషంఖర్చుకు తగిన ఆదాయం ఉండదు. నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృషభంస్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన […]

Local National ఉద్యోగాలు విద్య వినోదం

రూ.31వేల జీతంతో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (DRDL) లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 10 జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 14 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. మొత్తం […]

National జిల్లాలు వినోదం

ఇంటర్ ప్రవేశాలకు సరికొత్త విధానం!

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు సరికొత్త విధానంలో ప్రవేశాలకు కసరత్తు చేస్తున్నారు. మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదల చేసిన అధికారులు.. జూలై 5 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో వాట్సాప్ ద్వారా ప్రవేశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించారు. ఈసారి వాట్సాప్‌ బేస్డ్‌ అడ్మిషన్లు కల్పించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని […]