Local World జిల్లాలు హెల్త్

ఆశా వర్కర్లు, హోం గార్డుల వేతనాలు పెంపు

తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ లు, జడ్పీటీసీ, ఎంపీటీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు హోం గార్డులు, అంగన్ వాడీ వర్కర్లు/ సహాయకులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు సెర్ప్ ఉద్యోగుల జీతాలను కూడా 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ముడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించారు. […]

World ఉద్యోగాలు విద్య

జూన్ నెల బ్యాంకు సెలవులు ఇవే

బ్యాంక్ కస్టమర్స్ కి ముఖ్యమైన సమాచారం. ఆదివారం, రెండు నాలుగో శనివారాలు మినహాయించి కూడా కొన్ని సెలవలు వున్నాయి. కాబట్టి బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయాలని తెలుసుకోవాలి. బ్యాంక్ సెలవులు రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల ఒక రాష్ట్రం లో సెలవు ఉంటే మరో రాష్ట్రం లో సెలవు లేక పోవచ్చు. బ్యాంక్ సెలవలు, పని వేళలు తెలుసుకుంటే మీరు దానికి అనుగుణంగా మీ పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇక సెలవలు ఎప్పుడు అనేది చూస్తే..జూన్ […]

World విద్య

బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నిజంగా ప్రాణానికే ప్రమాదం. కరోనా వైరస్ నుండి రికవరీ అయిన తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పలువురు పడుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్‌ని మ్యుకర్‌మైకోసెస్ అని కూడా అంటారు. ఇది ఒక ఫంగల్ డిసీజ్ అని చెప్పొచ్చు. స్టెరాయిడ్స్ ఎక్కువ కాలం తీసుకున్న పేషెంట్లలో ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఆస్పత్రిలో ఉన్న వాళ్ళు ఆక్సిజన్ సపోర్ట్ లేదా వెంటిలేటర్ సహాయం పొందిన వారు, ఆసుపత్రులు శుభ్రత సరిగా […]

Local World క్రీడలు హెల్త్

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు(బీసీ) చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉణ్న బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి రూ.125.30 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపకార వేతనాల నిధులు విడుదలైన వెంటనే ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, ఈబీసీ విదార్థులకు ఉపకార వేతనాలు వెంటనే అందనున్నాయి. అదేవిధంగా విదేశీ విద్యానిధి పథకానికి సైతం తెలంగాణ […]

World జిల్లాలు వినోదం

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపికబురు

2019 సెప్టెంబర్‌ 30కి ముందు వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు వచ్చే వరకూ సర్వీసులో కొనసాగటానికి, ప్రయోజనాలు పొందటానికి అర్హులని హైకోర్టు తీర్పు వెల్ల‌డించింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల వయసు.. 60 ఏళ్ల లోపు ఉంటే తక్షణమే పునర్నియమించాలని ఆదేశించింది. 2010 సెప్టెంబర్‌ 10న ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం 58 […]

Local World ఉద్యోగాలు

8 వేల మంది చిన్నారులకు కరోనా

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8 వేలకు పైగా చిన్నారులకు కరోనా సోకింది. వైర‌స్ సోకిన చిన్నారుల‌కు చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్కూల్ వాతావ‌ర‌ణాన్ని తలపించేలా క‌రోనా వార్డులను సిద్ధం చేస్తున్నామ‌ని అన్నారు. జిల్లాలోని చిన్నారుల్లో 10శాతం మందికి కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందుకే థర్డ్‌ వేవ్ నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చిన్న పిల్లల వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని […]

World జిల్లాలు హెల్త్

నేటి రాశి ఫలితాలు (31-05-2021)

వారం: సోమవారంతిథి: పంచమి ఉ7:08నక్షత్రం: శ్రవణం రా.8:55శుభసమయం: మ.12:01దుర్ముహూర్తం: ప.12:22 నుండి ప.1:18 వరకుపునః ప.2:55 నుండి ప.2:55 వరకురాహుకాలం: ఉ.7:30 నుండి ఉ.9.00 వరకుయమగండం: ఉ.10.30 నుండి మ.12.00 వరకు మేషంసమాజంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభంముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ […]

Local National World జిల్లాలు వినోదం

కొత్తగా 1,801 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,801 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,75,827కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనాతో మరో 16 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,263కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 35,042 యాక్టీవ్ కేసులున్నట్లు […]

World జిల్లాలు వినోదం

ఆనందయ్య మందుపై నేడే ఫైనల్ రిపోర్ట్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై ఈరోజు తుది నివేదిక రానుంది. ఆయన పంపిణీ చేసిన మందు పనితీరుపై వైద్య బృందాలు ఇప్పటికే అధ్యయనం చేశాయి. ఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఆన్ లైన్ లో రిపోర్టులను పంపాయి. కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ పరిశోధకులు ఆ రిపోర్టులను పరిశీలించారు. ఈరోజు మందుపై క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై ఈరోజు హైకోర్టులో తుదివిచారణ జరగనుంది. అయితే ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు ఈరోజు […]

Local National World జిల్లాలు

రైతులకు శుభవార్త

తెలంగాణ రైతులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) శుభవార్త చెప్పారు. జూన్ 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులను జమచేస్తామని తెలిపారు. వానాకాలం ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను ఫెస్టిసైడ్స్‌ను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కల్తీవిత్తనాలు, ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద ఉక్కుపాదం మోపాలని వ్యవసాయ శాఖ , పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు సీఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

World విద్య వినోదం

సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్

సీబీఐ నూతన డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైశ్వాల్ నియమితులయ్యారు. 1985 మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ పదవి కోసం ముగ్గురు పేర్లను పరిశీలించిన ఎంపిక కమిటీ చివరకు సుభోధ్‌ కుమార్‌ను ఖరారు చేసింది. ప్రస్తుతం జైస్వాల్‌ సీఐఎస్‌ఎఫ్‌ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పలు కీలక కేసుల్లో ఈయన దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు.

World ఉద్యోగాలు విద్య

కిరాణా షాపుల్లో 5 కేజీల సిలిండర్లు

5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్లు (ప్రీ ట్రేడ్ ఎల్పీజీ) ఇకపై పెట్రోల్ బంక్ లు, కిరాణా షాపుల్లోను లభించనున్నాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఈ సిలిండర్లను పొందవచ్చంది. వీటి ధర రూ. 495.50 గా నిర్ణయించింది. సమీపంలోని డీలర్ వద్ద రీఫిల్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం వినియోగదారులకు మేలు కలిగించనుంది.

World క్రీడలు విద్య

తొలి టీకా తీసుకున్న వ్యక్తి మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా కొవిడ్ -19 టీకా తీసుకుని చరిత్ర సృష్టించిన విలియం షేక్‌స్పియర్‌ (81) కన్నుమూశారు. యూనివర్సిటీ హాస్పిటల్‌ కోవెంట్రీ, వారివక్‌షైర్‌లో గత ఏడాది డిసెంబర్‌ 8న షేక్‌స్పియర్‌ మొట్టమొదటి ఫైజర్‌ టీకా డోస్‌ తీసుకున్నారు. ఈ టీకాను తీసుకున్న తొలి పురుషుడిగా షేక్ స్పియర్ రికార్డు నెలకొల్పాడు. అయితే ఇతర అనారోగ్య సమస్యలతో అదే ఆస్పత్రిలో చేరిన షేక్‌స్పియర్‌ ఈనెల 20న కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

World క్రీడలు వినోదం హెల్త్

ఆ విషయంలో కేంద్రం ఆందోళన

కరోనా కోట్ల మంది జీవితాలను దుర్భరం చేస్తోంది. ఓ వైపు లక్షల మంది నేరుగా దీని భారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇక కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. వైరస్‌ను అరికట్టేందుకు ఆర్థికంగా నష్టపోయినా ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి వైరస్‌ను అరికట్టాలని నిబంధనలు విధించారు. నిబంధనల అమలు కోసం పోలీసులు సైతం కఠిన నిబంధనలు […]

World జిల్లాలు వినోదం

కూరగాయలు ఇలా శుభ్రపరచుకోండి

కూరగాయలు, పండ్లు ఎలా శుభ్రం చేసుకోవాలనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. మార్కెట్లో రకరకాల వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చే వాటితో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకుంటే కరోనా కాలంలో సమస్యలు అంటుకోక మానవు. అయితే కూరగాయలు, పండ్లు రుచిని కోల్పోకుండా శుభ్రపరుచుకునే విషయంలో ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని చిట్కాలను సూచించింది. *బయట నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ఎవరూ ముట్టుకోకుండా అలాగే సంచీలో పక్కన […]

World జిల్లాలు వినోదం

రెండు రోజుల్లో టెన్త్ రిజల్ట్స్

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఫలితాల విడుదలకు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారు. కరోనా కారణంగా వార్షిక పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ-1) ఆధారంగా మార్కులు కేటాయించి గ్రేడ్లను ఖరారు చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,398 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి విద్యాశాఖ గ్రేడ్లు కేటాయించింది. వీరిలో దాదాపు సగం మందికి […]

World క్రీడలు విద్య

ఏపీలో అక్కడ సంపూర్ణ లాక్ డౌన్

ఏపీలో రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. ఈ సడలింపుల సమయంలో అరకు వ్యాలీలో పర్యాటకులు పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అరకు వ్యాలీలో లాక్ డౌన్ విధించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి ఈ నెలాఖరు వరకు అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు […]

World విద్య వినోదం

కరోనా శవానికి ముద్దులు

కరోనా వైరస్ ప్రజల్లో ఉన్న మానవ సంబంధాలను చిన్నాభిన్నం చేస్తోంది. అయినవారే దగ్గరకు రావడానికి జంకుతున్న ఈ సమయంలో పాజిటివ్ తో మరణించిన వారి కుటుంబాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా చోట్ల ఖననం చేయడానికి గ్రామాల్లోకి అనుమతించని పరిస్థితులు ఏర్పడ్డాయి. అడుగు ముందుకు వేసినా తమకు వైరస్ ఎక్కడ అంటుకుంటుందో అని దూరంగా ఉంటూ పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా అంత్యక్రియలకు అతి తక్కవ మందికే అనుమతి ఇస్తోంది. అయితే ప్రజల్లో […]

World విద్య హెల్త్

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. వాక్సినేషన్ డ్రైవ్ ను ఎందుకు నిర్వహించలేదని, ఇతర రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ లాగా తెలంగాణలో ఎందుకు నిర్వహించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వ్యాక్షినేషన్ ఇచ్చే విషయంలో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటిషనర్స్ తెలిపారు. అయితే బెడ్స్ సామర్ధ్యంపై ప్రభుత్వ వెబ్ సైట్ లో ఒక్క సంఖ్య గ్రౌండ్ లెవెల్ లో మరో సంఖ్య ఉంటుందని హైకోర్టు సీరియస్ అయ్యింది. మొదటి ఫేస్ లో ప్రైవేట్ ఆసుపత్రి చార్జీలపై […]

Local World

ఎక్కువ గంటలు పనిచేస్తే ప్రమాదమే: డబ్ల్యూహెచ్‌వో

సాధారణ పని గంటల కంటే ఎక్కవ గంటలు పని చేసే వారిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో)తో కలిసి సంయుక్తంగా చేసిన అధ్యయన నివేదికను డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసింది. అధ్యయనం ప్రకారం వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ పనిచేసే వారికి గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని డబ్ల్యూహెచ్ వో పర్యావరణ విభాగం డైరెక్టర్ మరియా నీరా హెచ్చరించారు. […]