Local National క్రీడలు వినోదం

నేటి రాశి ఫలితాలు (16-06-2021)

వారం: బుధవారంతిథి: షష్టి రా.6:55నక్షత్రం: మఘ రా.7:12శుభసమయం: మ.02:15దుర్ముహూర్తం: ఉ.11.34 నుండి మ.12:21 వరకురాహుకాలం: మ.12.00 నుండి మ.1:30 వరకుయమగండం: ఉ.7.30 నుండి ఉ.9.00 వరకు మేషంముఖ్యమైన వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి వలన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృషభంఆర్ధిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా […]

Local క్రీడలు వినోదం

పీఎఫ్‌-ఆధార్‌ లింక్ గడువు పెంపు

ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలకు సంబంధిచిన యూఏఎన్ నెంబర్ ను ఆధార్ నెంబర్ తో లింకు చేయడానికి యాజమాన్యాలకు విధించిన గడువును పెంచుతూ ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ నిర్ణయం తీసుకుంది. మొదటి గడువు జూన్ 1 తో ముగిసిపోయింది. తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 1 వరకు పెంచుతున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. తాజా నిర్ణయంతో ఉద్యోగుల యూఏఎన్‌ – ఆధార్‌ నంబర్లను లింక్‌ చేయడానికి కంపెనీలకు మరింత సమయం లభించనుంది.

Local క్రీడలు విద్య హెల్త్

ఇక నుంచి నేరుగా కరోనా టీకా

కరోనా టీకా తీసుకునేందుకు ఇక నుంచి రిజిస్ట్రేషన్, అపాయిట్ మెంట్ అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. 18 ఏళ్లు దాటిన వారు నేరుగా దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కరోనా టీకా తీసుకోవచ్చని తెలిపింది. ఆన్ లైన్ అవసరం లేకుండా టీకా కేంద్రంలోనే వివరాలు నమోదు చేసుకొని టీకాలు వేస్తారని ప్రకటించింది. దీంతో ప్రజలకు రిలిఫ్ దొరికినట్టు అయ్యింది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యాక్సిన్ అని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో చదువు రాని వారికి, […]

National క్రీడలు విద్య హెల్త్

భార్య తీరుతో బౌన్సర్ కఠిన నిర్ణయం

భార్య ప్రవర్తన ఓ పచ్చని కుటుంబంలో రక్తపుటేరులు పారేలా చేసింది. అనుమానం అనే పెను భూతం ఆ ముచ్చటైన కుటుంబాన్ని నిలువునా చంపేసింది. హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఉన్న సివాహ్ గ్రామంలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రమేష్ కడియన్ అలియాస్ మాస్సే(28) అనే వ్యక్తి తన భార్య అను, ఏడాది వయసున్న కవిష్ అనే బాబుతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాడు. అక్కడ ప్రాపర్టీ డీలర్‌ పద్మ పన్వర్ […]

National ఉద్యోగాలు క్రీడలు వినోదం హెల్త్

నేటి రాశి ఫలితాలు (14-06-2021)

వారం: సోమవారంతిథి: చవితి రా.7:37నక్షత్రం: పుష్యమి సా.6:24శుభసమయం: సా.06:00దుర్ముహూర్తం: మ.12.25 నుండి మ.1:17 వరకుతిరిగి మ.03.01 నుంచి మ.03.53 వరకురాహుకాలం: ఉ.07:30 నుండి ఉ.09.00 వరకుయమగండం: ఉ.10.30 నుండి మ.12.00 వరకు మేషం బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూరప్రయాణ సూచనలున్నాయి. వృషభం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. పాత […]

National క్రీడలు వినోదం

డీఆర్డీవోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..ఈరోజే చివరి తేదీ

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (DRDL)లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 10 జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 14 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. మొత్తం ఖాళీలు: […]

National క్రీడలు వినోదం

11 గంటలకు బీజేపీ జెండా కప్పుకోనున్న ఈటల

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉదయం 11 గంటలకు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు కాషాయ కండువా కప్పుకుంటారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం అవుతారు. కాగా, తనతో కలిసి వస్తున్న నేతలతోపాటు బీజేపీ నాయకులను ఢిల్లీ తీసుకెళ్లేందుకు ఈటల రాజేందర్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలో చేరిన అనంతరం రేపు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. […]

National క్రీడలు వినోదం

అలర్ట్..భారీవర్షాలు, పిడుగులు..ఐఎండీ హెచ్చరిక

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలతోపాటు పిడుగుల పడే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) సోమవారం హెచ్చరించింది. జూన్ 15, 16 తేదీల్లో ఉదయం నుంచి పంజాబ్, హర్యానా, చండీఘడ్ ప్రాంతాల్లో భారీవర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రాగల 48 గంట్లలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని, పలుప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గంటకు 30 నుంచి […]

Local National ఉద్యోగాలు క్రీడలు వినోదం

నేటి రాశి ఫలితాలు (02-06-2021)

వారం: బుధవారంతిథి: అష్టమి ఉ.04:58నక్షత్రం: శతభిషం రా.9:11శుభసమయం: మ.2:15దుర్ముహూర్తం: ఉ.11:34 నుండి మ.12:21 వరకురాహుకాలం: ఉ.12:00 నుండి రా.01.30 వరకుయమగండం: ఉ.7.30 నుండి ఉ.09.00 వరకు మేషం వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆప్తుల నుండి ధన సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘ కాలిక రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభం దాయాదులతోఆస్థివివాదాలు పరిష్కరించుకుంటారు […]

Local World క్రీడలు హెల్త్

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు(బీసీ) చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉణ్న బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి రూ.125.30 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపకార వేతనాల నిధులు విడుదలైన వెంటనే ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, ఈబీసీ విదార్థులకు ఉపకార వేతనాలు వెంటనే అందనున్నాయి. అదేవిధంగా విదేశీ విద్యానిధి పథకానికి సైతం తెలంగాణ […]

National క్రీడలు వినోదం

రూ.40,000 జీతంతో ఉద్యోగాలు

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన 20 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులు ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, మెకానికల్‌ విభాగాల్లో ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ ఇంటర్వ్యూలు జూన్‌ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. […]

National క్రీడలు విద్య

నెయ్యి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

నెయ్యి తింటే కొవ్వు పెరిగే అవకాశం ఉందని, నెయ్యి అరగదని రకరకాల అపోహలు ఉన్నాయి. కానీ నెయ్యి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో అమైనో ఆమ్లాలుంటాయి. వాటి వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులు కరుగుతాయి. కాబట్టి అనవసర కొవ్వు పెరుగుతుందనేది అపోహ మాత్రమే. కొంతమంది నెయ్యి తింటే అరగదని.. నెయ్యిని తినడం మానేస్తారు. కానీ నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. అందువల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి మనుషుల్లో […]

National క్రీడలు విద్య

కరోనా టైంలో లోన్ అందిస్తున్న బ్యాంకులివే

కోవిడ్‌-19 వైద్య చికిత్స కోసం ప్రభుత్వ‌రంగ బ్యాంకులు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఖాతాదారులు త‌మ సొంత అవసరాల కోసం, లేదంటే త‌మ కుటుంబ స‌భ్యుల కోసం ఈ రుణాల‌ను తీసుకోవ‌చ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లోన్లపై వ‌డ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. లోన్ మొత్తం రూ.25,000 నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని తిరిగి చెల్లించే గడువు ఐదేళ్ల వరకు ఉంటుంది. మ‌రికొన్ని బ్యాంకులు కూడా ఈ రుణాలకు సంబంధించిన‌ […]

National క్రీడలు జిల్లాలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌ డౌన్ సడలింపు నిబంధనలు పొడిగించిన నేపథ్యంలో సడలింపు నిబంధనలకు అనుగుణంగా భూములు, ఆస్తులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ను పొడిగించిన విషయం తెలిసిందే. అయితే కర్ఫ్యూ సడలింపును ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకూ పెంచడంతో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల వరకే […]

Local క్రీడలు వినోదం

నేటి రాశి ఫలితాలు (30-05-2021)

వారం: ఆదివారంతిథి: చవితి ఉ7:40నక్షత్రం: ఉత్తరాషాఢ రా.9:30శుభసమయం: మ.2:01దుర్ముహూర్తం:సా. 4:38 నుండి సా.5:26 వరకురాహుకాలం: సా.4:30 నుండి సా.6.00 వరకుయమగండం: మ.12.00 నుండి మ.1.30 వరకు మేషంచేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో చర్చలు పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృషభంపనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన […]

Local National క్రీడలు వినోదం

సీఎం జగన్ పై మరో కేసు!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో మరొకటి చేరింది. ఇప్పటికే జగన్ పై 11 సబీఐ, 6 ఈడీ కేసులు నమోదు కాగా, తాజాగా మరో కేసు నమోదు అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18 కి చేరింది. ఉమ్మడి రాష్ట్ర ఏపీ హౌసింగ్‌ బోర్డు, ఇందూ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టిన హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సీఎం […]

Local క్రీడలు జిల్లాలు

లాక్ డౌన్ పై మూడు ప్రతిపాదనలు?

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం కాబోతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ముందు మూడు ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించడం. రెండవది వీకెండ్ లాక్ డౌన్. శని ఆదివారాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ […]

Local క్రీడలు విద్య

కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం!

తోటి మహిళా కానిస్టేబుల్ పై ఓ ఎస్ఐ అతి దారుణంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా గోపాలపూర్‌ అవుట్‌పోస్టులో ఈ దారుణం చోటుచేసుకుందని బాలేశ్వర్‌ ఎస్పీ సుధాంశు శేఖర్‌ వివరించారు. యాస్ తుపాను నేపథ్యంలో గోపాలపూర్ అవుట్ పోస్టులో అదనపు సిబ్బందిని నియమించారు. ఇందులో బాధిత మహిళా కానిస్టేబుల్ కూడా ఒకరు. అక్కడే విధుల్లో ఉన్న ఆమెపై బుధవారం రాత్రి ఎస్ఐ బన్సీంధర్ ప్రధాన్ అత్యాచారం చేశాడు. ఈ దారుణంపై బాధితురాలు గురువారం […]

Buying Tips National క్రీడలు

పరీక్ష లేకుండానే జాబ్స్.. రూ.1.40 లక్షల వరకూ జీతం

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మహారత్న సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 280 ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (ఈఈటీ) పోస్తులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను గేట్‌-2021 స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 21 నుంచి ప్రారంభమవుతుంది. […]

National ఉద్యోగాలు క్రీడలు

నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె!

నేటి నుంచి తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. గతంలో ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటం ప్రకారం అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 10 నోటీసులు జారీ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదని దీంతో నోటీసు ప్రకారం సమ్మెకు దిగుతామని చెబుతున్నారు. కాగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు ఇచ్చిన వినతిని పరిగణించడం లేదని డీఎంఈ స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ […]