Local National క్రీడలు వినోదం

నేటి రాశి ఫలితాలు (16-06-2021)

వారం: బుధవారం
తిథి: షష్టి రా.6:55
నక్షత్రం: మఘ రా.7:12
శుభసమయం: మ.02:15
దుర్ముహూర్తం: ఉ.11.34 నుండి మ.12:21 వరకు
రాహుకాలం: మ.12.00 నుండి మ.1:30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి ఉ.9.00 వరకు

మేషం
ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి వలన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

వృషభం
ఆర్ధిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

మిధునం
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఆదాయం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరంగా స్థిరమైన లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

See also  భారత్ బంద్ కు మావోయిస్టుల మద్దతు ఉందా?

కర్కాటకం
ఆర్థిక వాతావరణం అస్తవ్యస్తంగా ఉంటుంది. అకారణంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికం అవుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. కుటుంబ వాతావరణం మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన మార్పు ఉండక నిరాశ కలుగుతుంది.

సింహం
గృహము సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

కన్య
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దీర్ఘకాలిక రుణఒత్తిడి పెరుగుతుంది. అధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాపరంగా సొంత నిర్ణయాలు అమలు పరచడం మంచిది.

తుల
దీర్ఘకాలిక రోగ రుణ భాదల నుండి విముక్తి పొందుతారు. ఆర్ధిక పరిస్థితి మరింత ఉత్సహంగా ఉంటుంది కొన్ని వ్యవహారాలలో ఆప్తుల నుండి ఊహించని సహాయం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

See also  సచిన్ టెండుల్కర్ కు కరోనా

వృశ్చికం
వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకి గురి అవుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా వాతావరణం అనుకూలిస్తుంది.

ధనస్సు
దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని మేలైన సౌకర్యాలు పొందుతారు. పితృ వర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. అవసరానికి ధనం అందుతుంది.

మకరం
ఇంట బయట చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చెయ్యలేక విమర్శలు ఎదురుకుంటారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి.

See also  నేటి పంచాంగం (11-03-2021)

కుంభం
దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సానుకులమవుతాయి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబందిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మీనం
వృత్తి, ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. నూతన వ్యాపారాలకి పెట్టుబడులు అందుతాయి. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..

Leave a Reply

Your email address will not be published.