National క్రీడలు విద్య హెల్త్

భార్య తీరుతో బౌన్సర్ కఠిన నిర్ణయం

భార్య ప్రవర్తన ఓ పచ్చని కుటుంబంలో రక్తపుటేరులు పారేలా చేసింది. అనుమానం అనే పెను భూతం ఆ ముచ్చటైన కుటుంబాన్ని నిలువునా చంపేసింది. హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఉన్న సివాహ్ గ్రామంలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రమేష్ కడియన్ అలియాస్ మాస్సే(28) అనే వ్యక్తి తన భార్య అను, ఏడాది వయసున్న కవిష్ అనే బాబుతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాడు. అక్కడ ప్రాపర్టీ డీలర్‌ పద్మ పన్వర్ వద్ద బౌన్సర్‌గా పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఇటీవల లాక్ డౌన్ విధించడంతో కుటుంబాన్ని తీసుకుని స్వగ్రామానికి చేరుకున్నాడు. గ్రామంలో ఓ ఇంటిని కూడా నిర్మించుకుంటున్నాడు. అంతా బాగుంది అనుకుంటున్నప్పటికి భార్య తీరు రమేష్ ను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. బౌన్సర్ అయిన తన భర్త వేరే ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తూ వస్తోంది. ఈ విషయంలో ప్రతి రెండు మూడు రోజులకు ఓ సారైనా దంపతుల మధ్య గొడవ జరిగేది.
గ్రామానికి వచ్చాక ఏ అమ్మాయితో మాట్లాడినా పెడార్థం వచ్చేలా మాట్లాడేది భార్య. ఇక తన కుమారుడితో సంతోషంగా గడుపుతున్న సమయంలోనూ భార్య మాటలు అతడిని తీవ్రంగా వేధించసాగాయి.

See also  రైతులకు కేంద్రం తీపి కబురు?

అను తనకు మనశ్శాంతి లేకుండా చేస్తోందని భావించిన రమేష్ జూన్ 3న క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే ఢిల్లీలో ఉన్న తన యజమాని కొడుకు నితిన్ పన్వర్‌కు కాల్ చేశాడు. ఆ తర్వాత తన బావమరిదికి కూడా ఫోన్ చేసి విషయం వారితో చెప్పేశాడు. బావ మాటలు విన్న బావమరదికి చెమటలు పట్టాయి. మీ అక్కను, బాబును చంపేశాను.. తాను రైలు కింద పడి చనిపోబోతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

See also  ఆడపిల్ల పుడితే అదనంగా రూ.5 వేలు కానుక

రమేష్ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన బావమరిది తన బావ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే వారు రమేష్ కుటుంబం ఉంటున్న ఇంట్లోకి వెళ్లిచూడగా రక్తపు మడుగులో అను, బాబు విగత జీవులుగా పడి ఉన్నారు. గదిలో రమేష్ కనిపించకపోయేసరికి రైల్వే ట్రాక్ వద్దకు పరుగులు తీశారు. అప్పటికే రమేష్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్‌పీ పోలీసులు రమేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  మాస్క్ పెట్టుకోలేదని 11 మందిపై కేసు

Leave a Reply

Your email address will not be published.