Local ఉద్యోగాలు జిల్లాలు విద్య

17 నుంచి జియో ఫైబర్ సేవలు.. వివరాలు ఇవే

ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. జియో ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవలను ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించిన జియో వర్గాలు.. వినియోగదారులను ఆశ్చర్యపరిచే ఆఫర్ ప్రకటించారు. ఇకపై జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల నుండి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొత్త కనెక్షన్లకు ఇన్ స్టలేషన్ ఛార్జీ రూ. 1500 వసూలు చేస్తుండగా ఇకపై వాటిని రద్దు చేసినట్లు తెలిపింది. అయితే పోస్ట్ పెయిడ్ కనెక్షన్ కు కనీసం 6 లేదా 12 నెలల ప్లాన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఓవర్-ది-టాప్ సేవలు కావాలనుకునేవారు మాత్రం రూ.100 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  తెలంగాణలో టెన్షన్..అక్కడ 4,000 కోళ్లు మృతి

Leave a Reply

Your email address will not be published.