National క్రీడలు వినోదం

డీఆర్డీవోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..ఈరోజే చివరి తేదీ

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (DRDL)లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 10 జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 14 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 10
మెకానికల్ ఇంజినీరింగ్- 7
ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్- 3

See also  నేటి నుంచి ఆన్ లైన్ తరగతలు

ముఖ్య సమాచారం:
అర్హతలు: జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టుకు మెకానికల్ ఇంజనీరింగ్‌లో.. ఏరోనాటికల్ పోస్టుకు సంబంధిత‌ బ్రాంచీలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణ‌త సాధించాలి. గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.
వయసు: అభ్య‌ర్థుల వయసు 28 ఏళ్ల లోపు ఉండాలి.
వేతనం: రూ.31,000
ద‌ర‌ఖాస్తు విధానం: నిర్ణీత న‌మూనాలో ఉన్న దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తిగా నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సంబంధిత అడ్ర‌స్‌కు పోస్టులో పంపించాలి.
అడ్రస్: The Director, DRDL, Dr. APJ Abdul Kalam Missile Complex, Kanchanbagh PO, Hyderabad – 500058
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 14, 2021
వెబ్‌సైట్:https://www.drdo.gov.in/

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  ఏప్రిల్ 1 నుంచి వాటి పై ధర పెంపు?

Leave a Reply

Your email address will not be published.