National క్రీడలు వినోదం

11 గంటలకు బీజేపీ జెండా కప్పుకోనున్న ఈటల

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉదయం 11 గంటలకు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు కాషాయ కండువా కప్పుకుంటారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం అవుతారు. కాగా, తనతో కలిసి వస్తున్న నేతలతోపాటు బీజేపీ నాయకులను ఢిల్లీ తీసుకెళ్లేందుకు ఈటల రాజేందర్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలో చేరిన అనంతరం రేపు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. పార్టీలో చేరిక కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొంటారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  కరోనా వచ్చినా.. పెళ్లి ఆగలేదు

Leave a Reply

Your email address will not be published.