ఉద్యోగాలు విద్య హెల్త్

తెలంగాణ విద్యార్ధులకు అలర్ట్..జూలై 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కీలక ప్రకటన చేశారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా 70 శాతం సిలబస్ ఆధారంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిసింది. మరోవైపు జూలై 5 వరకు ఫస్టియర్ మొదటి విడత ప్రవేశాలు జరుగుతాయని అన్నారు. రెండు, మూడు విడతల్లో కూడా ఫస్టియర్ ప్రవేశాలను జరిపి.. ఆ తర్వాత వారికి దూరదర్శన్, టీశాట్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు ప్రసారం చేస్తామని చెప్పారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  ఆ బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్

Leave a Reply

Your email address will not be published.