National జిల్లాలు వినోదం

ఆ హీరోయిన్ కూ తప్పని వేధింపులు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు సర్వ సాధారణమని చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే చెప్పారు. అలాగే మరికొందరు హీరోయిన్లు దర్శక నిర్మాతలు నటుల పేర్లను బయటపెట్టారు. అయితే ఇటు టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలలో కూడా వివాదం పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవంపై స్పందించారు. ఈ క్రమంలోనే కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ చేదు ఘటనను వెల్లడించింది. బాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం తిరిగుతున్న సమయంలో ఇండస్ట్రీలో ఓ వ్యక్తితో పరిచయం జరిగింది. జీవితంలో అతడి కంటే గొప్ప వ్యక్తి లేడని బిల్డప్ ఇచ్చేవాడు. తాను నటించే ఓ చిత్రంలో కిస్సింగ్ సీన్ లో నటించాల్సి ఉందని.. దాని కోసం రిహార్సల్ చేయాలని పిలిచాడు. కిస్సింగ్ సీన్ రిహాల్స్ పేరుతో నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మనసులోని భయాలను పక్కన పెట్టు అంటూ దారుణంగా ప్రవర్తించేవాడు అంటూ జరీన్ ఖాన్ తెలిపింది.

తన దారిలోకి మలుచుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడని ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా క్లోజ్ గా ఉండాలని ఆఫర్ల విషయాలను తను చూసుకుంటాను అంటూ మిస్ బీహేవ్ చేశాడని జరీన్ ఖాన్ తెలిపింది. అయితే ఇండస్ట్రీకి కొత్త కావడంతో తనకు తాను నాకు సర్దిచెప్పుకొన్నానని ఆ వ్యక్తి పేరు చెప్పడం కూడా ఇష్టం లేదని జరీన్ ఖాన్ తెలిపింది. కాల్ సెంటర్ లో పనిచేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే దానిని అని తెలిపింది. జరీన్ ఖాన్.. సల్మాన్ ఖాన్ సరసన వీర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘హౌస్ ఫుల్ 2’ ‘హేట్ స్టోరీ 3’ ‘అక్సర్ 2’ ‘1921’ ‘హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ సినిమాలో కీలక పాత్ర పోషించింది.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  కేంద్రం మరో కీలక నిర్ణయం

Leave a Reply

Your email address will not be published.