World విద్య

బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నిజంగా ప్రాణానికే ప్రమాదం. కరోనా వైరస్ నుండి రికవరీ అయిన తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పలువురు పడుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్‌ని మ్యుకర్‌మైకోసెస్ అని కూడా అంటారు. ఇది ఒక ఫంగల్ డిసీజ్ అని చెప్పొచ్చు. స్టెరాయిడ్స్ ఎక్కువ కాలం తీసుకున్న పేషెంట్లలో ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఆస్పత్రిలో ఉన్న వాళ్ళు ఆక్సిజన్ సపోర్ట్ లేదా వెంటిలేటర్ సహాయం పొందిన వారు, ఆసుపత్రులు శుభ్రత సరిగా లేనప్పుడు, డయాబెటిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం వుంది అని గుర్తించారు. బ్లాక్ ఫంగస్‌కి సరైన చికిత్స లేకపోతే ప్రాణానికే ప్రమాదమని వెల్లడించారు. కరోనా చికిత్సలో మందులు ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, బలహీనంగా మారిపోతారని అంటున్నారు. డయాబెటిస్ పేషంట్స్‌లో మరియు డయాబెటిస్ లేని వాళ్లలో కూడా షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయి. దీనికి కారణం బ్లాక్ ఫంగస్. జ్వరం, తల నొప్పి, కళ్ళు మసకబారడం, ముఖం మీద వాపులు ఉండడం ఇలాంటివి వస్తున్నాయి.

బ్లాక్ ఫంగస్ రాకుండా ఇలా చేయండి:
ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడం.. వీలైతే ఎక్కువ సార్లు పుక్కిలించడం లాంటివి చేయాలి. కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఒక్క బ్రష్‌ని కూడా మార్చడం చాలా ముఖ్యం. ఇలా ఈ విధంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా బారిన పడ్డ వాళ్ళ బ్రష్ పక్కన బ్రష్ హోల్డర్‌లో మీ బ్రష్‌ని ఉంచడం కూడా మంచిది కాదు. మీరు మీ యొక్క బ్రష్‌ని, టంగ్ క్లీనర్ ని వేరేగా పక్కన పెట్టుకోండి. అంతే కానీ వాటితో పాటు పెట్టుకోవడం మంచిది కాదు. రోజుకి రెండు నుంచి మూడు సార్లు బ్రష్ చేయడం ఎంతో మంచిది.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  ఈ జాబ్స్ అప్లై చెయ్యడానికి ఈరోజే లాస్ట్ డేట్

Leave a Reply

Your email address will not be published.