National క్రీడలు వినోదం

రూ.40,000 జీతంతో ఉద్యోగాలు

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన 20 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులు ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, మెకానికల్‌ విభాగాల్లో ఉన్నాయి.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ ఇంటర్వ్యూలు జూన్‌ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

  1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 12
    విభాగాలు: ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, మెకానికల్‌
    అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
    వయసు: ఏప్రిల్‌ 30, 2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
    జీతాలు: నెలకు రూ.40 వేలు ఉంటుంది.
  2. అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 8
    విభాగాలు: ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, మెకానికల్‌
    అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
    వయసు: ఏప్రిల్‌ 30, 2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
    జీతాలు: నెలకు రూ.30 వేలు ఉంటుంది.
See also  తొలి టీకా తీసుకున్న వ్యక్తి మృతి

ముఖ్య సమాచారం:
ఎంపిక ప్రక్రియ: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు: 2021, జూన్‌ 15,16 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు జూన్‌ 15వ తేదీన, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ జూన్‌ 16వ తేదీన ఇంటర్వ్యూల నిర్వహణ ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక:ECIL Regional Office, H.No. 47-09-28, Mukund Suvasa Apartments, 3rd Lane Dwaraka Nagar, Visakhapatnam-530016
వెబ్‌సైట్‌:http://www.ecil.co.in/

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  స్పా పేరుతో వ్యభిచారం.. ముఠా గుట్టు రట్టు

Leave a Reply

Your email address will not be published.