World జిల్లాలు వినోదం

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపికబురు

2019 సెప్టెంబర్‌ 30కి ముందు వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు వచ్చే వరకూ సర్వీసులో కొనసాగటానికి, ప్రయోజనాలు పొందటానికి అర్హులని హైకోర్టు తీర్పు వెల్ల‌డించింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల వయసు.. 60 ఏళ్ల లోపు ఉంటే తక్షణమే పునర్నియమించాలని ఆదేశించింది. 2010 సెప్టెంబర్‌ 10న ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం 58 ఏళ్లకే పలువురు ఆర్టీసీ ఎంప్లాయిస్ రిటైర్ అయ్యారు. గ‌వ‌ర్న‌మెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నోటిఫికేషన్‌ ఉందంటూ పదవీ విరమణ పొందిన కొందరు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. 2017 లో పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ గ‌వ‌ర్న‌మెంట్ నోటిఫికేషన్‌ జారీ చేసిందని హైకోర్టు పేర్కొంది. దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ఉద్యోగుల మధ్య వివక్ష చూపేలా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ తీర్పు ఇచ్చింది.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  ప్రేమించిందని యువతిపై పెట్రోల్ దాడి

Leave a Reply

Your email address will not be published.