Local World ఉద్యోగాలు

8 వేల మంది చిన్నారులకు కరోనా

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8 వేలకు పైగా చిన్నారులకు కరోనా సోకింది. వైర‌స్ సోకిన చిన్నారుల‌కు చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్కూల్ వాతావ‌ర‌ణాన్ని తలపించేలా క‌రోనా వార్డులను సిద్ధం చేస్తున్నామ‌ని అన్నారు. జిల్లాలోని చిన్నారుల్లో 10శాతం మందికి కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందుకే థర్డ్‌ వేవ్ నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చిన్న పిల్లల వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఒకే జిల్లాలో 8వేల మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ గా తేలడం సంచలనంగా మారింది. మరో వైపు దేశ వ్యాప్తంగా కూడా చిన్నారుల్లో కరోనా పాజిటివిటి రేటు పెరుగుతుంది. మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రభావం అధికంగా ఉంది. ఏపీ, తెలంగాణలో కూడా దాదాపు 1000 మందికి పైగా చిన్నారులకు కరోనా సోకినట్టు సమాచారం.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  ఆమె పై అత్యాచారం జరగలేదు

Leave a Reply

Your email address will not be published.