Local National ఉద్యోగాలు విద్య

చిన్నారుల ఆరోగ్యంపై నీతి ఆయోగ్ కీలక ప్రకటన

దేశంలో పలుచోట్ల చిన్నారులు కూడా కరోనా బారినపడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రకటన చేశారు. కరోనా నుంచి కోలుకున్న 2 నుంచి 6 వారాల మధ్య ఆరోగ్య సమస్యలు రావొచ్చని వెల్లడించారు. పిల్లల్లో సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. అనేకమంది చిన్నారుల్లో కరోనా సోకినప్పటికీ లక్షణాలు కనిపించడంలేదని వీకే పాల్ తెలిపారు. వైరస్ సంక్రమణ, ప్రవర్తనలో మార్పులొస్తే కరోనా తీవ్రత పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, న్యూమోనియా సమస్యలు వస్తే ఆసుపత్రిలో చేరాలని స్పష్టం చేశారు. కొందరిలో కోలుకున్న 3 వారాల తర్వాత కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. దేశంలో తాజా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నామని వీకే పాల్ వెల్లడించారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  నేడు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో..వారికి వేయోద్దు

Leave a Reply

Your email address will not be published.