National క్రీడలు విద్య

కరోనా టైంలో లోన్ అందిస్తున్న బ్యాంకులివే

కోవిడ్‌-19 వైద్య చికిత్స కోసం ప్రభుత్వ‌రంగ బ్యాంకులు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఖాతాదారులు త‌మ సొంత అవసరాల కోసం, లేదంటే త‌మ కుటుంబ స‌భ్యుల కోసం ఈ రుణాల‌ను తీసుకోవ‌చ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లోన్లపై వ‌డ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. లోన్ మొత్తం రూ.25,000 నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని తిరిగి చెల్లించే గడువు ఐదేళ్ల వరకు ఉంటుంది. మ‌రికొన్ని బ్యాంకులు కూడా ఈ రుణాలకు సంబంధించిన‌ అర్హ‌తా ప్ర‌మాణాల గురించి వివ‌రాలు వెల్ల‌డించాయి. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లోన్లపై వ‌డ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. ఇక్కడ కూడా లోన్ టెన్యూర్ ఐదేళ్ల వరకు ఉంది. సాధార‌ణంగా ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు వ్య‌క్తిగ‌త రుణాల‌కు సంవ‌త్స‌రానికి 14-18 శాతం వడ్డీ రేట్లను విధిస్తాయి. అంతకంటే తక్కువ రేటుకే కోవిడ్ చికిత్స కోసం రుణాలు ఇస్తున్నట్లు వివిధ బ్యాంకులు వెబ్‌సైట్లలో పేర్కొన్నాయి. కెన‌రా బ్యాంక్ కూడా సుర‌క్షా వ్య‌క్తిగ‌త రుణాన్ని ఆఫ‌ర్ చేస్తోంది. ఇందులో రూ. 25,000 నుంచి రూ.5 ల‌క్ష‌ల వరకు లోన్ ఇస్తున్నారు. కెన‌రా సుర‌క్షా ప‌థ‌కం కింద ఆరు నెల‌ల మారిటోరియం కూడా అందుబాటులో ఉంది.

గ‌త 12 నెల‌లుగా బ్యాంకు నుంచి జీతాలు గానీ, పెన్ష‌న్‌గానీ విత్‌ డ్రా చేస్తున్న క‌స్ట‌మ‌ర్లు, బ్యాంకు నుంచి రిటైల్ లోన్ (హోమ్ లోన్, వాహ‌న రుణం, వ్య‌క్తిగ‌త రుణం, న‌గ‌దు రుణం.. వంటివి) తీసుకున్న‌వారు, బ్యాంకులో సేంవింగ్స్ లేదా క‌రెంట్ అకౌంట్ ఉండి, ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్‌లు స‌క్ర‌మంగా పూర్తిచేస్తున్న నాన్‌-శాల‌రీడ్ (జీతం లేని) వ్య‌క్తులు ఈ లోన్‌లు పొందవచ్చు. గ‌తేడాది కూడా ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు కోవిడ్‌-19 వ్య‌క్తిగ‌త రుణాల‌ను ప్రారంభించాయి. అయితే మ‌హ‌మ్మారి కార‌ణంగా న‌గ‌దు కొర‌త‌ను తీర్చాల్సి ఉంది. ఈ లోన్లు అప్ప‌టికే ఉన్న‌ క‌స్ట‌మ‌ర్ల‌కూ అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 7.2 శాతం కంటే త‌క్కువ‌ వడ్డీతో లోన్లు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు కూడా త‌క్కువ ధ‌ర‌లో కోవిడ్‌-19 చికిత్స కోసం వ్య‌క్తిగ‌త రుణాలు అందుబాటులో ఉన్నాయి. తాత్కాలికంగా న‌గ‌దు స‌మ‌స్య‌ను ఎదుర్కొనే వారు ఈ లోన్లు తీసుకోవ‌చ్చు. క్యాష్‌-ఫ్లోలో అనిశ్చితి ఉంటే మాత్రం వీటి జోలికి పోవద్దు. అయితే ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో వ్యక్తులపై రుణ చెల్లింపుల బాధ్య‌త లేక‌పోవ‌డ‌మే మంచిది. కొత్త‌గా చెల్లింపు బాధ్య‌త‌ను తీసుకునే బ‌దులు ఉన్న ఆస్తిని న‌గ‌దుగా మార్చుకోవ‌డం ఉత్త‌మని ఆర్థిక సలహాదారులు విశ్లేషిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి లోన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  ఊరంతా ఏకమై..కాళ్లు కడిగి పూజలు చేసి ఊరేగింపు

Leave a Reply

Your email address will not be published.