World జిల్లాలు హెల్త్

నేటి రాశి ఫలితాలు (31-05-2021)

వారం: సోమవారం
తిథి: పంచమి ఉ7:08
నక్షత్రం: శ్రవణం రా.8:55
శుభసమయం: మ.12:01
దుర్ముహూర్తం: ప.12:22 నుండి ప.1:18 వరకు
పునః ప.2:55 నుండి ప.2:55 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి ఉ.9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి మ.12.00 వరకు

మేషం
సమాజంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మిధునం
ధన వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి. ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార ప్రయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి. ప్రయాణాలు కలసిరావు.

See also  నేటి రాశి ఫలితాలు (04-05-2021)

కర్కాటకం
ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో పెద్దలను నుండి ప్రశంసలుఅందుకుంటారు. భాగస్వామ్యవ్యాపారమునకునూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అండదండలు కలుగుతాయి.

సింహం
ఆర్థికంగా నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. భూ వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయపడతారు.

కన్య
దీర్ఘ కాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయట పడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు.

తుల
కొన్ని విషయాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణవిషయంలో అప్రమత్తంగాఉండాలి. వృత్తి వ్యాపారాలలో శత్రు ఆధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరుగుతుంది.

See also  నేటి రాశి ఫలితాలు (26-05-2021)

వృశ్చికం
చేపట్టిన పనులలో మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

ధనస్సు
ఇతరులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన సకాలంలో సమయానికి పూర్తికాక నిరాశ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధికంగా స్వల్ప నష్ట సూచనలున్నవి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

మకరం
ముఖ్యమైన వ్యవహారములలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి సంభందిత వివాదాలు నుండి బయటపడతారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. సంఘములో పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభవార్త వింటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

See also  కరోనా టీకా వికటించి అంగన్వాడీ టీచర్ మృతి

కుంభం
వ్యాపారాలు నత్తనడక సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. ఇంట బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. వ్యాపారమున ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన కలుగుతుంది.

మీనం
దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఋణాల ఒత్తిడి పెరిగి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన విద్యా విషయాలు పట్ల సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగమున మీ పని తీరుకు ప్రశంసలు అందుకుంటారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..

Leave a Reply

Your email address will not be published.