National క్రీడలు జిల్లాలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌ డౌన్ సడలింపు నిబంధనలు పొడిగించిన నేపథ్యంలో సడలింపు నిబంధనలకు అనుగుణంగా భూములు, ఆస్తులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ను పొడిగించిన విషయం తెలిసిందే. అయితే కర్ఫ్యూ సడలింపును ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకూ పెంచడంతో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల వరకే సడలింపు ఉండటంతో రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా పోయింది. తాజా నిర్ణయంతో రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  పబ్జీ గేమ్ కారణంగా రెండు గ్రామాల మధ్య ఘర్షణ

Leave a Reply

Your email address will not be published.