National విద్య హెల్త్

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

తెలంగాణలో లాక్‌ డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో సైతం సమయాల్లో మార్పు చేసింది. ఇక నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చివరి మెట్రో రైలు ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై చివరి స్టేషన్‌ కు 12.45కి చేరుకుంటుందని మెట్రో ఎండీ ఎండీ కేవీబీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని కోరారు. స్టేషన్ల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఉదయం 7 నుంచి 8.45 వరకు మాత్రమే మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌ డౌన్‌ ను సడలింపు ఇచ్చిన నేపథ్యంలో మెట్రో సమయాలను హైదరాబాద్‌ మెట్రో పొడిగించింది.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం: కేంద్రం

Leave a Reply

Your email address will not be published.