National జిల్లాలు వినోదం

కరోనాతో యువతి.. బెడ్ పై తాళి కట్టిన యువకుడు

కరోనా బారిన పడి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న యువతికి ధైర్యం చెప్పేందుకు ఆమె ప్రియుడు ఐసీయూ బెడ్ మీదనే తాళి కట్టాడు. ప్రియుడి ధైర్యం చెప్పినా.. ఆమె కరోనాకు బలైంది. ఆమె మృతిచెందడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అంతలోనే ఆమె కరోనా బారిన పడింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మూడేళ్లుగా ఆ యువతిని ప్రేమిస్తున్న యువకుడు ఆమెకు ఎంతో ధైర్యం చెబుతూ బతికించుకునే ప్రయత్నం చేశాడు. వైద్యుల అనుమతి తీసుకుని వెంటిలేటరుపై చికిత్స పొందుతున్న యువతితో మాట్లాడాడు. నువ్వు కోలుకున్నాక దంపతులుగా బ్రతుకుదాం అంటూ భరోసా ఇచ్చాడు. అదే ఆసుపత్రి బెడ్‌ మీద ఆమె మెడలో తాళి కట్టి.. ‘నేను నీ భర్తను.. నిన్ను కాపాడుకుంటా’నంటూ చెప్పాడు. కానీ.. వెంటిలేటరు మీద ఉన్న ఆ యువతి కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఇటీవల మృతిచెందింది. ఆమె సోదరుడు, ప్రేమించిన యువకుడే ఆ యువతి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మరణించిన విషయం ఇంకా ఆమె తల్లిదండ్రులకు తెలియదు. ఆ యువతి మరణించిన క్షణం నుంచి.. ఆమె సోదరుడు, తాళి కట్టిన యువకుడు వెక్కివెక్కి ఏడుస్తూనే ఉన్నారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published.