Local విద్య హెల్త్

తెరిచి ఉండేవి.. మూసి ఉండేవి ఇవే

తెలంగాణలో లాక్‌ డౌన్‌ ను మరో 10 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి లాక్‌ డౌన్‌ పొడిగింపు అమల్లోకి వచ్చింది.

లాక్‌డౌన్‌ను పొడిగించిన ప్రభుత్వం.. సడలింపులు పెంచింది. నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌ డౌన్ సడలింపులు ఉంటాయి. ఆ తర్వాత మరో గంట పాటు అదనపు సమయం కేటాయించింది. ఆ సమయంలో ఇళ్లకు చేరుకునే వారు చేరుకోవాల్సి ఉంటుంది. 2 గంటల తర్వాత రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారు. వాహనాలు సీజ్ చేస్తారు.

See also  నేటి పంచాంగం (09-03-2021)

భూములు, ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. మరోవైపు ప్రైవేట్ ఆఫీసులు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది.

సడలింపు సమయంలో ఆర్టీసీ, సెట్విన్, మెట్రో, ఆటో, ట్యాక్సీలు నడుస్తాయి. సరుకు రవాణా వాహనాలకు కూడా ఆటంకాలు ఉండవు.

సరిహద్దుల వద్ద పాస్‌ లు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు యథావిధిగా అనుమతి లేదు. అంతర్రాష్ట్ర సర్వీసులు నడవవు

థియేటర్లు, పార్క్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌ మూసి ఉంచాల్సిందే. బార్లు, పబ్బలు, జిమ్‌లు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు.

See also  నటుడు సోనూసూద్ కి గుడికట్టిన ప్రజలు

మధ్యాహ్నం ఒంటి గంట వరకే పెట్రోల్‌ బంక్‌లు తెరిచి ఉంటాయి. అయితే హైవేపై ఉండే పెట్రోల్‌ బంక్‌ లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది.

లాక్‌ డౌన్‌ సమయంలో అత్యవసర సర్వీసులకు యథావిధిగా అనుమతి ఉంటుంది.

సడలింపు సమయంలో కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలోనే ప్రజలంతా తమ పనులు ముగించుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని కోరారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  ప్రియుని మోజులో భర్తను హత్య

Leave a Reply

Your email address will not be published.