World జిల్లాలు వినోదం

ఆనందయ్య మందుపై నేడే ఫైనల్ రిపోర్ట్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై ఈరోజు తుది నివేదిక రానుంది. ఆయన పంపిణీ చేసిన మందు పనితీరుపై వైద్య బృందాలు ఇప్పటికే అధ్యయనం చేశాయి. ఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఆన్ లైన్ లో రిపోర్టులను పంపాయి. కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ పరిశోధకులు ఆ రిపోర్టులను పరిశీలించారు. ఈరోజు మందుపై క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై ఈరోజు హైకోర్టులో తుదివిచారణ జరగనుంది.

అయితే ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు ఈరోజు అనుమతులు రావడం అనుమానమే అని అంటున్నారు. ఆనందయ్య మందు ఆయుర్వేద మందు కాదంటూ సీసీఆర్ఏఏస్ తేల్చేసినట్లు సమాచారం. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రాష్ట్ర పరిధిలో జారీ చేసే అవకాశం వుండగా… కేంద్ర పరిధిలోకి ఎందుకు వచ్చారంటూ సీసీఆర్ఏఏస్ అనుమానం వ్యక్తం చేసింది. ఆనందయ్య మందు పంపిణీ అంశాన్ని సీసీఆర్ఏఏస్ ఆయూష్ కి నివేదించనుంది. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు వచ్చే అవకాశం ఇప్పట్లో లేనట్లే అని నిపుణులు అంటున్నారు. అయితే ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  దళితుల చేత కాళ్లు మొక్కించుకున్న గ్రామ పెద్దలు

Leave a Reply

Your email address will not be published.