Local క్రీడలు వినోదం

నేటి రాశి ఫలితాలు (30-05-2021)

వారం: ఆదివారం
తిథి: చవితి ఉ7:40
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.9:30
శుభసమయం: మ.2:01
దుర్ముహూర్తం:సా. 4:38 నుండి సా.5:26 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి సా.6.00 వరకు
యమగండం: మ.12.00 నుండి మ.1.30 వరకు

మేషం
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో చర్చలు పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.

వృషభం
పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలబాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.

మిధునం
చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో విబేధాలు కలుగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాల నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.

See also  ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌ పై న్యాయవాది ఫిర్యాదు

కర్కాటకం
వృత్తి, ఉద్యోగాల నూతన ప్రోత్సహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతరులు నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి.

సింహం
సన్నిహితుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్థి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున శుభకార్య విషయమై బంధు మిత్రులను ఆహ్వానిస్తారు. సంతానానికి నూతన విద్యావకాశాలు పొందుతారు.

కన్య
కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. ధన వ్యవహారాలు మరింత చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

See also  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తుల
నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు స్థిరంగాఉండవు. కుటుంబవాతావరణం గందరగోళంగా ఉంటుంది వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సరిఅయిన నిర్ణయాలు చేయలేకపోవడం వలన నష్టపడతారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం
ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తి ఇస్తాయి. సోదరులు సహాయంతో చాలాకాలంగా వేధిస్తున్న వివాదాల నుండి బయట పడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు
ఇంట బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకరం
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంభందిత క్రయవిక్రయాలు కొనుగోలుచేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

See also  ఆ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కుంభం
ఋణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు మందకొడిగాసాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.

5మీనం
బంధు మిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..

Leave a Reply

Your email address will not be published.