Buying Tips National క్రీడలు

పరీక్ష లేకుండానే జాబ్స్.. రూ.1.40 లక్షల వరకూ జీతం

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మహారత్న సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 280 ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (ఈఈటీ) పోస్తులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను గేట్‌-2021 స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 21 నుంచి ప్రారంభమవుతుంది. జూన్‌ 10 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.ntpc.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టులు: 280
పోస్టు పేరు: ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (ఈఈటీ)
విభాగాలు: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ (బీటెక్‌, బీఈ).. కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి ఏడాది లేదా చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వాలిడ్‌ గేట్‌-2021 స్కోర్‌ ఉండాలి.
వయసు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్టంగా 27 ఏళ్లు మించకూడదు. మిగిలిన వారికి ప్రభుత్వ రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: గేట్‌-2021 స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పని ప్రదేశం: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌టీపీసీ యూనిట్లలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
జీతం: నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 21, 2021
దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 10, 2021
వెబ్‌సైట్‌:https://www.ntpc.co.in/

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

Leave a Reply

Your email address will not be published.