National విద్య హెల్త్

తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్‌లో కొత్త ఫీచర్

పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రయాణికులకు తెలంగాణ పోలీసుశాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఇకపై పొరుగు రాష్ట్రాల నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాన్ని తెలంగాణ పోలీసులు కల్పించారు. ఈ మేరకు వెబ్ సైట్ లో కొత్త ఫీచర్ తీసుకువచ్చారు. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాలు ఇచ్చే పాసుల ఆధారంగా తెలంగాణలోకి అనుమతి ఇచ్చేవారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాల నుంచి ఎక్కువగా ప్రయాణికులు తెలంగాణలోకి వస్తున్నారు.

అయితే కర్ణాటక అధికారులు తెలంగాణలోకి ప్రవేశించేందుకు పాసులు ఇవ్వడం లేదు. ఇతర రాష్ట్రాల్లోనూ పలు సాంకేంతిక సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు మరణిస్తే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు, ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చేందుకు, జాతీయ/అంతర్జాతీయ విమాన ప్రయాణికులను విమానాశ్రయంలో దింపేందుకు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు తిరిగొచ్చేందుకు, రాష్ట్రానికి చెందిన కుటుంబాలు వచ్చేందుకు, తెలంగాణలో వివాహానికి హాజరుకావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  81ఏళ్ల మహిళను పెళ్లాడిన 35ఏళ్ల యువకుడు

Leave a Reply

Your email address will not be published.