Local జిల్లాలు హెల్త్

డైరెక్టర్ సుకుమార్‌ మరో సాయం

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ మానవత్వం చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో ఆయన తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలంలో మరెందరికో ప్రాణవాయువును అందించబోతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రూ.40 లక్షల వ్యయంతో ఆక్సిజన్ ప్లాంటు ను నిర్మించేందుకు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. నాలుగు రోజుల్లో పనులు పూర్తి అవుతయని ఆయన స్నేహితుడు ఒకరు తెలిపారు. తొలుత రూ.25 లక్షలతో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలనుకున్నారు. కానీ ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మిస్తే అవసరానికి తగిన ఆక్సిజన్‌ తయారుచేసుకోవచ్చన్న ఉద్దేశంతో సుకుమార్ మరో రూ.15 లక్షలు అదనంగా అందించారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం

Leave a Reply

Your email address will not be published.