World క్రీడలు వినోదం హెల్త్

ఆ విషయంలో కేంద్రం ఆందోళన

కరోనా కోట్ల మంది జీవితాలను దుర్భరం చేస్తోంది. ఓ వైపు లక్షల మంది నేరుగా దీని భారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇక కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. వైరస్‌ను అరికట్టేందుకు ఆర్థికంగా నష్టపోయినా ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి వైరస్‌ను అరికట్టాలని నిబంధనలు విధించారు. నిబంధనల అమలు కోసం పోలీసులు సైతం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు..ఇంతా చేస్తున్నా దేశంలోని కొంతమంది ప్రజలు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న నిబంధనలు పాటించేందుకు వెనకడుగు వేస్తున్నారు..ఈనేపథ్యంలోనే లాక్డౌన్ నిబంధనలు, మాస్క్ ధరించడంపై కేంద్రం పలు సంచలన విషయాలను వెల్లడించింది.

ముఖ్యంగా దేశంలో లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నావారు అంటే కనీసం మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నవారు కేవలం 14 శాతమేనని ఓ అధ్యయనంలో వెల్లడైనట్టు తెలిపారు. ప్రభుత్వాలు పలుసార్లు హెచ్చరిస్తున్నా.. 50 శాతం మంది ఇంకా మాస్కులు లేకుండానే తిరుగుతున్నట్టు వెల్లడించింది.ఇక మాస్కులు ధరిస్తున్నవారు కూడ తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. మాస్కులు ధరిస్తున్న వారిలో 64 శాతం మంది సరిగా పెట్టుకోకుండా మాస్క్ మాత్రం ముక్కు క్రింది బాగంలో పెట్టుకుని తిరుగుతున్నట్టు వెల్లడించింది. ఇంకా కొద్ది మంది గడ్డం పైన, లేదా మెడపైన పెట్టుకుని తిరుగుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వివరించారు. ఇక ఇంటివద్దే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే ఒక కంపెనీ దరఖాస్తు చేసుకొందని, మరో వారంలోగా మరో మూడు రాబోతున్నాయని వెల్లడించారు. మూడు, నాలుగు రోజుల్లోనే హోమ్‌ టెస్టింగ్‌ కిట్‌లు మార్కెట్లో అందుబాటులోకి వస్తాయన్నారు. మరోవైపు 50వేల నుంచి లక్ష యాక్టివ్‌ కేసులు 9 రాష్ట్రాల్లోలోనే ఉన్నట్టు చెప్పారు. వీటిలో కర్ణాటక, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో 25శాతం పాజిటివిటీ రేటు ఉందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  కరోనాతో ఉద్యోగి మరణించినా పూర్తి జీతం

Leave a Reply

Your email address will not be published.