Buying Tips National

గూగుల్ లో సెర్చ్ చేసింది.. రూ.3 లక్షలు పొగొట్టుకుంది

గూగుల్ లో సెర్చ్‌ చేయగా వచ్చిన నెంబర్ ‌కు ఫోన్ చేసి ఓ మహిళ ఏకంగా రూ.3.15 లక్షలు పొగొట్టుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌ లో జరిగింది. న్యూస్ 18 కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ మహిళ అమెజాన్‌లో ఓ వస్తువు కోసం ఆర్డర్ చేసింది. ఆర్డర్ డెలివరీ లేట్ కావడంతో.. కస్టమర్ కేర్‌కు కాల్ చేద్దామని.. నెంబర్ కోసం గూగుల్ లో సెర్చ్‌ చేసింది. అక్కడ కనిపించిన ఓ నెంబర్ ‌ను గుర్తించి.. వెంటనే ఆ నెంబర్ కి కాల్ చేసింది. తన ఆర్డర్ వివరాలను తెలియజేసింది. దీంతో అతడు కొద్దిసేపటి తర్వాత మహిళకు తిరిగి ఫోన్ చేసి.. అమెజాన్ ప్రతినిధినంటూ.. స్టాక్ లేకపోవడంతో ఆర్డర్ లేట్ అయిందని చెప్పాడు.

See also  ఎయిర్‌ఫోర్స్ ‌లో 1515 జాబ్స్

స్టాక్ లేకపోవడం వల్ల ఆమె డబ్బును తిరిగి చెల్లిస్తామని నమ్మబలికాడు. ఆమె ఫోన్‌కు ఓ క్యూఆర్ కోడ్ పంపించి దానిని క్లిక్ చేయాలని సూచించాడు. అలా చేస్తే మీ ఖాతాలోకి డబ్బులు క్రెడిట్ అవుతాయని చెప్పాడు. అది నిజమేనని నమ్మిన ఆ మహిళ.. క్యూఆర్ కోడ్ ‌ను స్కాన్ చేసింది. దీంతో క్షణాల్లో ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.3.15 లక్షలు డెబిట్ అయ్యాయి. ఆ నెంబర్ కి మళ్లీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళ.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంక్, క్రెడిట్ కార్డు, ఇతర ముఖ్యమైన సంస్థల కస్టమర్ కేర్‌ నెంబర్ల‌ను అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే పొందాలని నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  టెన్త్,ఇంటర్,డిగ్రీ అర్హతతో 459 ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published.