Buying Tips Local National

పైసా చెల్లించకుండా హోండా యాక్టివాను ఇంటికి తీసుకెళ్లండిలా.!

మీరు కొత్త టూవీలర్ కొనాలనుకుంటున్నారా.? ముఖ్యంగా హోండా యాక్టీవా కొనాలని ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారా.? అలాంటి వారి కోసం Honda Activa 6G తీపి కబురు చెప్పింది. హోండా యాక్టివ్ 6జీ మోడల్‌ను ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ వాహనంపై 100 శాతం ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తోంది హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. 2000 సంవత్సరంలో ఇండియన్ మార్కెట్‌లో అడుగుపెట్టిన హోండా యాక్టీవా 20 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తోంది.

ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న టూవీలర్స్‌లో కూడా హోండా యాక్టీవాదే పైచేయి. హోండా యాక్టీవా సేల్స్ పెంచడానికి హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. మరిన్ని ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా 100 శాతం ఫైనాన్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు మాత్రమే. హోండా అప్రూవ్డ్ బ్యాంకుల నుంచి మాత్రమే 100 శాతం ఫైనాన్స్ లభిస్తుంది. దీంతో పాటు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పేమెంట్స్ ఎంచుకునేవారికి రూ.5,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

See also  ఆ సేవలకు ఆర్‌టీఓ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు

అది కూడా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అప్రూవ్ చేసిన బ్యాంకులకు చెందిన కార్డులకే వర్తిస్తుంది. ఇక డౌన్‌పేమెంట్ చెల్లించాలనుకునేవారికి కూడా ఇతర ఆఫర్స్ కూడా ఉన్నాయి. కనీసం రూ.2,499 డౌన్‌పేమెంట్ చెల్లించి హోండా యాక్టీవా 6జీ కొనొచ్చు. వడ్డీ కేవలం 6.5 శాతం మాత్రమే. నగదు ప్రయోజనాలు ఏమీ ఉండవు.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  విమానంలో హద్దుమీరిన జంట!

Leave a Reply

Your email address will not be published.