Buying Tips National ఉద్యోగాలు

ఫ్లిప్ కార్ట్ లో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ 2021 ఫస్ట్ డే సేల్ ప్రకటించింది. జనవరి 20 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. జనవరి 24 వరకు ఈ ఫస్ట్ డే సేల్ కొనసాగనుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లు మాత్రం జనవరి 19 నుంచే ఈ డీల్ సేల్ యాక్సస్ చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేసే స్మార్ట్ ఫోన్ డీల్స్ లో టాప్ 5 స్మార్ట్ ఫోన్ల వివరాలిలా ఉన్నాయి. సేల్స్ స్టార్ట్ కాగానే మీకు నచ్చిన ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.

మోటోజీ G 5G: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో భాగంగా.. మోటోజీ G 5G మోడల్ స్మార్ట్ ఫోన్ రూ.2వేల డిస్కౌంట్‌తో వస్తోంది. 5G సపోర్ట్ చేసే ఈ మోడల్ ఫోన్ డిస్కౌంట్ ధరతో రూ.18,999లకే అందుబాటులో ఉంటుంది. ప్రధాన ఆకర్షణగా స్నాప్ డ్రాగన్ 750G 5G చిప్‌సెట్, 5000mAh గ్రేట్ బ్యాటరీ లైఫ్‌ అందిస్తోంది.

See also  జోగిని శ్యామల పై కేసు నమోదు

శాంసంగ్ గెలాక్సీ S20ప్లస్ : శాంసంగ్ గెలాక్సీ S20ప్లస్ మోడల్ ఫోన్.. డిస్కౌంట్ ధరతో వస్తోంది. అసలు ధర రూ.54,999లు ఉండగా.. తగ్గింపు ధరతో రూ.44,999లకే సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ S20 ప్లస్ మోడల్ ఫోన్ లో 120Hz AMOLED డిస్‌ప్లేతో అందిస్తోంది.

అసూస్ ROG ఫోన్ 3 : మొబైల్ గేమింగ్ డివైజ్‌ల్లో ROG Phone 3 స్మార్ట్ ఫోన్ ఒకటి. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌లో దీని ధర రూ.43,999లకే ఆఫర్ చేస్తోంది. ROG ఫోన్.. 144Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చింది. డిస్కౌంట్ ధరతో సొంతం చేసుకోవాలంటే బిగ్ సేల్ కు రెడీగా ఉండండి.

See also  విద్యా శాఖ కీలక ఆదేశాలు

ఎల్ జీ వింగ్ : ఎల్ జీ కంపెనీ అందించే మోడల్ ఫోన్లలో ఇదొకటి. ఎల్ జీ వింగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. హైఎండ్ ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ తగ్గింపు ధరతో రూ.64,990లకే సొంతం చేసుకోవచ్చు. అట్రాక్టివ్ డిస్‌ప్లే, రియర్ కెమెరా సిస్టమ్, గ్లింబల్ కెమెరా సిస్టమ్‌తో మార్కెట్లోకి వచ్చింది.

ఐక్యూ 3 : వివో సబ్ బ్రాండ్ ఐక్యూ నుంచి వచ్చిన కొన్ని కొత్త మోడల్ ఫోన్లలో ఇదొకటి.. IQOO3 ఫోన్.. గత ఏడాదిలోనే స్నాప్ డ్రాగన్ 865 చిప్ సెట్ తో మార్కెట్లోకి వచ్చింది. ప్రత్యేకించి మొబైల్ గేమర్ల కోసం ఈ మోడల్ గుడ్ డీల్ అని చెప్పొచ్చు. దీని ధర బిగ్ డే సేల్ లో రూ. 34,990లకే లభ్యం కానుంది.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు

Leave a Reply

Your email address will not be published.